పోస్ట్‌లు

డిసెంబర్, 2019లోని పోస్ట్‌లను చూపుతోంది

'హంపి విశేషాలు'

చిత్రం
హంపి శిల్పకళా వైభవం   Mahanavami dibba విజయనగర రాజుల హిందూ మతాభిలాషకు వారి శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలిచిన నగరం హంపి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి 80 km దూరంలో ఈ ప్రాంతం ఉంది.క్రీ.శ 1500 నాటి విజయనగరంలోని దేవాలయాలు మరియు ఇతర నిర్మాణాల శిధిలాల అద్భుతం ఈ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణ.హంపి ప్రపంచంలో రెండవ అతిపెద్ద నగరంగా ఉండేది. విరూపాక్ష దేవాలయం   7వ శతాబ్దం నాటి ఈ ఆలయానికి  విశిష్టమైన ప్రాముక్యత ఉంది ఈ దేవాలయానికి  3ప్రాకారాలు ఉన్నాయి 9ఖనాలతో 50 మీటర్ల ఎత్తులో తూర్పు గోపురంలోని రెండు ఖనాలు రాతితో నిర్మించారు.ఈ దేవాలయంలో ప్రధానదైవం విరుపాక్షుడు అనగా శివుడు. తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి కావలసిన నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్ళ్తుంది. ప్రవేశ రుసుము లేదు మరియు మీరు ఉదయం 8.30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఆలయాన్ని సందర్శించవచ్చు. విరూపాక్ష ఆలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది ఈ గుడి యుద్దంలో విజయం సాధించినందుకు గాను నిర్మించారు. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటి గా గుర్తించారు.

గోవా అందాలు

చిత్రం
  Many people hold the notion that while Goa is a great tourist spot, it should be avoided during the monsoon season, especially in August when the rains come down in all their glory. However, once you get rid of this notion, you realize that there is more to Goa during monsoon than you can possibly imagine. Here are a few reasons why a trip to Goa in August is actually a great idea! ఒకప్పుడు గోవాని పోర్చుగీసువారు పాలించారు . కాబట్టి గోవా ప్రజల జీవన విధానం కూడా  పోర్చుగీసువారి జీవనశైలిని  పోలి ఉంటుంది . ఇక్కడి ప్రకృతి అందాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ఇక్కడి ప్రజలు టూరిజం మీదే ఆధారపడి జీవిస్తుంటారు. గోవా రాజధాని పనాజీ ఇక్కడి వీధులు పరిసరాలు చాలా అందంగా కనిపిస్తుంటాయి అలాగే గోవా లో కొన్ని బీచ్ లు చాలా ఆకర్షణీయంగా మనకు ఉల్లాస భరితమైన ఆనందాన్ని పంచుతాయి. ఇక్కడ  క్యాసినోస్ పిల్లలకు పెద్దలకు ఒక ఆటవిడుపు.కాలాంగుటె బీచ్ అంజునా బీచ్ మరియు బాగా బీచ్ లో  పర్యాటకులు ఎక్కువుగా ఉంటారు.పనాజీ నుండి పర్యాటకులకు టూరిజం బస్సులు అందుబాటులో ఉంటాయి . అయితే ఎక్కువుగా ప్రైవేట్ వాహనాలు

Mahout train for elephants

చిత్రం

Chikamangaluru Coffee plantation in Resort

చిత్రం

శృంగేరి

చిత్రం
హిందువుల అద్వైత మఠం                                      ఈ నదీతీరంలోనే  ఆదిశంకరాచార్యులవారు అద్వైతసిద్ధిని పొందారు. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతం గా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, సహ్యాద్రిపర్వతశ్రేణులు  పరవశింప చేసే ప్రకృతి సౌందర్యం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. శృంగేరి కి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. శంకరాచార్యులవారు ధర్మ ప్రచారంలో భాగంగా దేశాటన జరపుతూ శృంగేరి చేరుకున్న సమయంలో అక్కడ ఆయనకు కంటబడిన రెండు సంఘటనలు ఆశ్చర్యాన్ని కల్గించాయట. దాంతో ఆయన తొలి మఠాన్ని ఇక్కడే నిర్మించి పన్నెండేళ్ళ పాటు ఇక్కడే గడిపారని స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత దేశాటన జరుపుతూ పూరిలో బదరిలో కంచిలో మరియు ద్వారకాలో మఠాలను స్థాపించారు. ఇక్కడ సందర్శించవలసిన కొన్ని ప్రదేశాలు శారదాంబ దేవి ఆలయం,విద్యాశంకర దేవాలయం మరియు ఆది శంకర దేవాలయం, పార్స్వనాధ దేవాలయం. భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.ఆలయంలో  నిత్యం అన్నప్రసాదం జరుగుతుంది.  మరిన్ని ప్రదేశాలు ఈ ప్రాంతం నుండి పర్యాటకులు సందర్శించవచ్చు. శృంగేరి నుండి ధర్మస

ముల్లయనగిరి , చిక్ మంగళూరు

చిత్రం
అద్భుతమైన అతి పొడవైన శిఖరం  ముల్లయనగిరి BABA BUDAN GIRI చిక్ మంగళూరు కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు జిల్లాలో ఈ పట్టణం ఉంది.ముల్లయనగిరి శిఖరం ఈ పట్టణానికి 16 K.M దూరంలో ఉన్న పశ్చిమ కనుమల్లో బాబా భూదాన్ గిరి కొండల్లో ఒక భాగం.ఇది సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం నుండి అరేబియా సముద్రాన్ని చూడవచ్చు.ఈ పర్వతం నుండి చూస్తే మేఘాలు కిందకు వచ్చి పర్యాటకులను కను విందు చేస్తాయి. కొండపై నుంచి చూస్తే పాదాలను మబ్బును తాకుతునట్లుగా అనిపించింది. ఈ పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.చుట్టూ కాఫీ తోటలు  జలపాతాలు ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.  చిక్ మంగళూరు  కాఫీ రాజధాని  అని కూడా అంటారు.కుద్రేముఖ్ చుట్టూ ఉన్న దట్టమైన అడవులు జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే మాణిక్యధార జలపాతం, కాళహస్తి జలపాతం ,కెమ్మనగుండి పర్వతం దగ్గర ఉన్న శాంతి జలపాతం, కదంబి జలపాతం ,హనుమాన్ గుండి జలపాతాలు ఇక్కడ చూడగలిగిన ప్రదేశాలు. బెంగుళూరు నుండి  చిక్ మంగళూరు కు (240 k.m) బస్సు సౌకర్యం కలదు.యాత్రికులకు resorts,hotels మరియు