శృంగేరి

హిందువుల అద్వైత మఠం 
                                   
Temple



ఈ నదీతీరంలోనే  ఆదిశంకరాచార్యులవారు అద్వైతసిద్ధిని పొందారు. ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతం గా ఉంటుంది. చుట్టూ పచ్చని చెట్లు, సహ్యాద్రిపర్వతశ్రేణులు  పరవశింప చేసే ప్రకృతి సౌందర్యం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. శృంగేరి కి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం పేరు మీద దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు.

శంకరాచార్యులవారు ధర్మ ప్రచారంలో భాగంగా దేశాటన జరపుతూ శృంగేరి చేరుకున్న సమయంలో అక్కడ ఆయనకు కంటబడిన రెండు సంఘటనలు ఆశ్చర్యాన్ని కల్గించాయట. దాంతో ఆయన తొలి మఠాన్ని ఇక్కడే నిర్మించి పన్నెండేళ్ళ పాటు ఇక్కడే గడిపారని స్థలపురాణం చెబుతోంది. ఆ తర్వాత దేశాటన జరుపుతూ పూరిలో బదరిలో కంచిలో మరియు ద్వారకాలో మఠాలను స్థాపించారు.


ఇక్కడ సందర్శించవలసిన కొన్ని ప్రదేశాలు

శారదాంబ దేవి ఆలయం,విద్యాశంకర దేవాలయం మరియు ఆది శంకర దేవాలయం, పార్స్వనాధ దేవాలయం.

భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.ఆలయంలో  నిత్యం అన్నప్రసాదం జరుగుతుంది. మరిన్ని ప్రదేశాలు ఈ ప్రాంతం నుండి పర్యాటకులు సందర్శించవచ్చు.శృంగేరి నుండి ధర్మస్థల,ఉడిపి మంగళూరు, Chikmagalur మరియు కుప్పళ్లి ప్రాంతాలకు పర్యటించవచ్చు .    

TEMPLE

                                  


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లోనావాలా మరియు ఖండాలాలో సందర్శించాల్సిన ప్రదేశాలు.

హంపిలోని బడవి లింగ ఆలయం Badavilinga Temple