ముల్లయనగిరి , చిక్ మంగళూరు
అద్భుతమైన అతి పొడవైన శిఖరం ముల్లయనగిరి
BABA BUDAN GIRI |
చిక్ మంగళూరు కర్ణాటక రాష్ట్రంలోని చిక్ మంగళూరు జిల్లాలో ఈ పట్టణం ఉంది.ముల్లయనగిరి శిఖరం ఈ పట్టణానికి 16 K.M దూరంలో ఉన్న పశ్చిమ కనుమల్లో బాబా భూదాన్ గిరి కొండల్లో ఒక భాగం.ఇది సముద్ర మట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతం నుండి అరేబియా సముద్రాన్ని చూడవచ్చు.ఈ పర్వతం నుండి చూస్తే మేఘాలు కిందకు వచ్చి పర్యాటకులను కను విందు చేస్తాయి. కొండపై నుంచి చూస్తే పాదాలను మబ్బును తాకుతునట్లుగా అనిపించింది.ఈ పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.చుట్టూ కాఫీ తోటలు జలపాతాలు ప్రకృతి అందాలు ఆకట్టుకుంటాయి ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు.
చిక్ మంగళూరు కాఫీ రాజధాని అని కూడా అంటారు.కుద్రేముఖ్ చుట్టూ ఉన్న దట్టమైన అడవులు జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అలాగే మాణిక్యధార జలపాతం, కాళహస్తి జలపాతం ,కెమ్మనగుండి పర్వతం దగ్గర ఉన్న శాంతి జలపాతం, కదంబి జలపాతం ,హనుమాన్ గుండి జలపాతాలు ఇక్కడ చూడగలిగిన ప్రదేశాలు.
బెంగుళూరు నుండి చిక్ మంగళూరుకు (240 k.m) బస్సు సౌకర్యం కలదు.యాత్రికులకు resorts,hotels మరియు homestays వంటి వసతి సదుపాయాలు కలవు అయితే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటె మంచిది ముఖ్యంగ homestays resorts.
The weather in Chikmagalur is almost perfect throughout the year. It is a coffee paradise for coffee lovers. The plantations here have the most inviting aroma and scenic beauty. Accommodation is not too expensive here.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Thank you