'హంపి విశేషాలు'
హంపి శిల్పకళా వైభవం Mahanavami dibba విజయనగర రాజుల హిందూ మతాభిలాషకు వారి శిల్పకళాభిరుచికి నిదర్శనంగా నిలిచిన నగరం హంపి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారికి 80 km దూరంలో ఈ ప్రాంతం ఉంది.క్రీ.శ 1500 నాటి విజయనగరంలోని దేవాలయాలు మరియు ఇతర నిర్మాణాల శిధిలాల అద్భుతం ఈ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణ.హంపి ప్రపంచంలో రెండవ అతిపెద్ద నగరంగా ఉండేది. విరూపాక్ష దేవాలయం 7వ శతాబ్దం నాటి ఈ ఆలయానికి విశిష్టమైన ప్రాముక్యత ఉంది ఈ దేవాలయానికి 3ప్రాకారాలు ఉన్నాయి 9ఖనాలతో 50 మీటర్ల ఎత్తులో తూర్పు గోపురంలోని రెండు ఖనాలు రాతితో నిర్మించారు.ఈ దేవాలయంలో ప్రధానదైవం విరుపాక్షుడు అనగా శివుడు. తుంగభద్రా నది నుండి ఒక చిన్న నీటి ప్రవాహం ఆలయంలోకి ప్రవేశించి గుడి వంట గదికి కావలసిన నీరు అందించి బయటి ప్రాకారం ద్వారా బయటకు వెళ్ళ్తుంది. ప్రవేశ రుసుము లేదు మరియు మీరు ఉదయం 8.30 నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఆలయాన్ని సందర్శించవచ్చు. విరూపాక్ష ఆలయంతో బాటు బాలకృష్ణుడి గుడి కూడా ఉంది ఈ గుడి యుద్దంలో విజయం సాధించినందుకు గాను నిర్మించారు. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో ఒకటి గా గుర్తించారు.