మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగం , ఉజ్జయిని


ఉజ్జయిని మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగం(Mahakaleshwar Jyotirlinga )
మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగం

మహాకాలేశ్వర్ జ్యోతిర్లింగం శివుడికి అంకితం చేయబడిన ఒక హిందూ దేవాలయం మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి, శివుడి అత్యంత పవిత్రమైన నివాసాలుగా చెప్పబడే పుణ్యక్షేత్రాలు. ఇది భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పురాతన నగరమైన ఉజ్జయినిలో ఉంది. ఈ దేవాలయం క్షిప్రానది ఒడ్డున ఉంది.ఈ దేవాలయంలో శివలింగాన్ని "స్వయంభువు"గా భావిస్తారు.
ఈక్షేత్రంలో ఇతర చిత్రాలు, లింగాల వలె కాకుండా మంత్ర శక్తితో యేర్పడిన శివలింగంగా భావిస్తారు.ఇక్కడ దేవుడికి సమర్పించిన ప్రసాదం తిరిగి ఇస్తాడని ఒక గాథగా ఇక్కడ చెబుతారు.ఈ దేవాలయంలోని మహాకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణ ముఖం వైపు ఉన్నందున"దక్షిణామూర్తి" అని కూడా అంటారు.ఉజ్జయినిలో  ఉన్నశివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. 
ఈ ఆలయంలో లో తెల్లవారు జామున త్రయంబకేశ్వరునికి భస్మ హారతి  జరుగుతుంది. భస్మ హారతి తిలకిస్తే అకాల మృత్యు భయాలు ఉండవు అంటారు.హారతి సమయంలో మంత్రాలు జపించడం, గంభీరమైన ధ్వనులు చేయటం వల్ల గర్భగుడి శక్తివంతమైన ప్రకంపనాలతో మార్మోగిపోతుంది.అందుకే ఈ క్షేత్రాన్ని మహా స్మశానం అంటారు.
ఇక్కడి క్షిప్రా నదిలో స్నామాచరించిన మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఉజ్జయిని చేరుకోవడానికి ప్రయాణ మార్గాలు
ఉజ్జయిని రైల్వే స్టేషన్ ఉజ్జయిని నగరాన్ని పొరుగున ఉన్న నగరాలతో కలుపుతుంది. ఇండోర్‌లోని దేవి అహిల్యబాయి హోల్కర్ విమానాశ్రయం ఉజ్జయిని నగరానికి సమీప విమానాశ్రయం. ప్రధాన నగరం ఉజ్జయిని నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ప్రయాణీకులు బస్సుల ద్వారా విమానాశ్రయానికి సులభంగా చేరుకోవచ్చు.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

లోనావాలా మరియు ఖండాలాలో సందర్శించాల్సిన ప్రదేశాలు.

మనాలి, హిమాచల్ ప్రదేశ్